అమరావతిముచ్చట్లు:
‘తల్లికి వందనం’ పథకం లబ్ధి పొందాలంటే విద్యార్థి ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాల/కళాశాలలో చదువుతూ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలవారీ ఆదాయం రూ.10 వేలలోపు, పట్టణాల్లో రూ.12 వేలలోపు ఉండాలి. మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమికి మించరాదు. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ఇంటికి నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగం ఉండరాదు. రేషన్ కార్డు, తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ సీడింగ్, NPCI లింకేజీ తప్పనిసరి. గత ఏడాది 75 శాతం హాజరు ఉండాలి. అయితే ఈ ఏడాది ఒకటో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు హాజరు నిబంధన నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోర్సుల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.
Tags: These qualifications are mandatory to avail the ‘Talliki Vandanam’ scheme