July 22, 2026
Explore
మద్యం మత్తులో అతి వేగం.. రెండు బైకులు ఢీ

మద్యం మత్తులో అతి వేగం.. రెండు బైకులు ఢీ

July 22, 2026 | Andhra Pradesh

ఇద్దరు అన్నదమ్ములకు తీవ్ర గాయాలు

కడప ముచ్చట్లు:


రాజంపేట పట్టణంలోని ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై మంగళవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు.

బోయపాలెం వీధికి చెందిన రాజా విష్ణు, ఈశ్వర్‌ గాయపడిన వారిగా గుర్తించారు.

ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడు మద్యం సేవించి అతి వేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అనంతరం కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం వారిని తిరుపతికి తరలించారు.

ఈ ఘటన పై పోలీసులు విచారణ చేస్తున్నారు

Tags: Drunken speeding… two bikes collide.