July 22, 2026
Explore
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే

July 22, 2026 | Andhra Pradesh

అక్రమ ఇసుక రవాణా ఇద్దరి ప్రాణాలు బలితీసింది..

టి.సుండుపల్లి ముచ్చట్లు:

టి.సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లికి చెందిన అబ్బన్నగారి జయరాం, రెడ్డిచర్ల రవీంద్ర కలిసి జీవాలవారపు సంతకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఆగస్టు 15 వరకు ఇసుక రవాణా నిలిపివేయాలని జిల్లా అధికారుల స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతోందని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు.

ఈ ప్రమాదానికి అక్రమ ఇసుక రవాణానే కారణమన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన టిప్పర్ యజమానులు, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ ఇసుక రవాణా సహకరించిన వారినీ కేసులో నిందితులుగా చేర్చాలని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టాలని అధికారులను కోరారు.

Tags:Strict action must be taken against those responsible: MLA