September 5, 2026
Explore
6న టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్‌నాయుడు పర్యటన

6న టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్‌నాయుడు పర్యటన

September 5, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ గా ఇటీవల నియమితులైన మధుసూదన్‌నాయుడు ఆదివారం పుంగనూరులో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు కురప్పల్లెలోని మసెమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని పూజలు నిర్వహించనున్నారు. అలాగే శ్రీ సుగుటూరు గంగమ్మను దర్శించుకుని, శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అలాగే దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి , బాలాజి మూవిల్యాండ్‌ సమీపంలోని నూతన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

Tags: TDP in-charge Madhusudan Naidu’s tour on the 6th.