అమరావతిముచ్చట్లు:
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. వర్షాల సమయంలో ప్రజలు, రైతులు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండకూడదని అధికారులు హెచ్చరించారు.
Tags: Heavy rains in AP for three days: Meteorological Department