కురబలకోట ముచ్చట్లు:
ట్రాక్టర్ ఢీకొని జర్నలిస్టు దంపతులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన మంగళవారం సాయంత్రం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లి కు చెందిన జర్నలిస్టు చిన్న యుగంధర్ ద్విచక్ర వాహనంలో తన భార్యను ఓ ఇంజనీరింగ్ కళాశాల నుండి మదనపల్లికి తీసుకువస్తుండగా మార్గమధ్యంలోనే బైపాస్ రోడ్డులో ట్రాక్టర్ ఢీ కొట్టి రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు 108 లో వెంటనే మదనపల్లి కు తరలించగా చికిత్స పొందుతున్నారు.
Tags: Journalist couple critically injured after being hit by a tractor at Angallu.