పుంగనూరుముచ్చట్లు:
రైతులు తాము పండించిన పంటలకు సంబంధించి ఈనెల 24లోపు భీమ నమోదు చేసుకోవాలని ఏడి శివకుమార్ సూచించారు. మంగళవారం ఏవో రాధ తో కలసి ఆయన మండలంలోని సుగాలిమిట్ట, పాళెంపల్లె గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రైతులతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు రాగిపంటకు జూలై 31 వరకు, వరి పంటకు ఆగస్టు 15 వరకు రైతులు ప్రీమియం చెల్లించి ధరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగిలిన పంటలకు 24 లోపు తమ రికార్డులను ఆర్‌ఎస్‌కె కేంద్రాలలో సమర్పించి, నమోదు చేసుకోవాలని సూచించారు.
Tags; Crop insurance registration must be completed by the 24th.