July 21, 2026
Explore
ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు కష్టాలు తప్పవు

ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు కష్టాలు తప్పవు

July 21, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌శాఖను ప్రైవేటీకరణ చేస్తూ జీవో ఎంఎస్‌నెంబరు: 396ను విడుదల చేయడాన్ని నిరశిస్తూ దస్తావేజులేఖర్లు, డీటీపి ఆపరేటర్లు, ట్యాంప్‌వెండార్స్ లు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పూలత్యాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌శాఖను ప్రైవేటీకరణ చేయడంతో ప్రజలకు కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్నిశాఖలను ప్రైవేటుకు అప్పగించే కార్యక్రమాలు చేపడుతోందని ఆరోపించారు. రిజిస్ట్రేషన్‌శాఖను ప్రైవేటుపరం చేస్తే ప్రజలు దోపిడికి గురౌతారని ఆరోపించారు. కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని పెన్‌డౌన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమం 31వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దస్తావేజులేఖర్ల సంఘం ప్రతినిదులు కె.రామమూర్తి, రవికుమార్‌, పవన్‌కుమార్‌, రవిచంద్రరాజు, ఖలీల్‌, భానుమూర్తి, జ్యోతి, శిల్ప, కృష్ణవేణి, గణేష్‌, రమణ, సాధిక్‌, మునిరాజచారి తదితరులు పాల్గొన్నారు.

Tags: Hardships for the people are inevitable due to the government’s decisions.