అమరావతిముచ్చట్లు:
ఈనెల 24వ తేదీన మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్, స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృత్రికా శుక్ల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ ,స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని కార్యక్రమాల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించడంతోపాటు మండల అధికారులు మరియు ప్రత్యేక అధికారులు లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెగా పేరెంట్స్ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలన్నారు. గత రెండు సంవత్సరాల్లో చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా మినిట్ టూ మినిట్ కార్యక్రమాన్ని తప్పక పాటించాలని, పిల్లల తో ఇన్విటేషన్ కార్డులు తయారు చేయించి ప్రతి టీచర్ వారి తరగతుల్లోని పిల్లల ద్వారా వారి తల్లిదండ్రులకు ఇన్విటేషన్లు అందించేలా చూడాలన్నారు అలాగే ప్రతి స్కూలులో ప్రజాప్రతిని ధులు పాల్గొనేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరు లీప్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని , ప్రతి ఒక్క పేరెంట్స్ సెల్ ఫోన్లలో స్టూడెంట్ కు సంబంధించిన ఈ యాప్ ఉండాలని సూచించారు. జిల్లాలోని 1503 పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని తల్లిదండ్రులు ఇద్దరు తప్పక రావాలన్నారు. వెయ్యి మంది పిల్లలు ఉన్న పాఠశాలలో పంచాయతీ స్టాప్ గాని వెల్ఫేర్ సెక్రెటరీ గాని నియమించాలన్నారు. కార్యక్రమం అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అందరికీ అందించాలని తెలిపారు.
వర్షాకాలం ప్రారంభమై నoదున తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని కార్యక్రమంమీ ప్రతినెల నాలుగవ శనివారం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు .ఇందులో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ , సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేర్పించటం జరుగుతుందన్నారు .ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎం లకు, గృహిణులకు అందరకు నేర్పించడం జరుగుతుందని, ఇందులో పాము కాటుకు ,కుక్క కాటుకు, బ్లీడింగ్ అవుతుంటే ఎలా కాపాడాలి, కరెంట్ షాక్ తగిలినప్పుడు ఏం చేయాలి , అంగన్వాడి స్కూల్ పిల్లలు ఏవైనా వస్తువులు మింగిన ఏం చేయాలని దానిమీద వివరంగా తెలియజేయాలని డిఎం హెచ్ ఓ సూచించారు. వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ పూర్తిస్థాయిలో నాలెడ్జి కలిగి ఉండాలన్నారు. ప్రతి ఇంటిలో ప్రతి స్కూలులో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.
Tags: Teachers’ meeting and ‘Swarna Grama Arogya Darshani’ programs.