పుంగనూరుముచ్చట్లు:
అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని తహశీల్ధార్ కార్యాలయం సీపీఐ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. మంగళవారం ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వెంకటరమణారెడ్డి, సీపీఐ కార్యదర్శి రామమూర్తి ఆధ్వర్యంలో తహశీల్ధార్ రాముకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేసి, నిర్మాణ ఖర్చుల కోసం రూ.5 లక్షలు పెంచాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇండ్లను పేదలకు పంపిణీ చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సహాయకార్యదర్శి మున్న తదితరులు పాల్గొన్నారు.
Tags; House sites should be allotted to eligible poor people.