పుంగనూరుముచ్చట్లు:
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఏపియుటిఎఫ్) రాష్ట్రకమిటి పిలుపు మేరకు ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. మంగళవారం స్థానిక తహశీల్ధార్ కార్యాలయం ఎదుట జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరాహ్రారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ 11వ పీఆర్‌సి గడువు ముగిసి 32 నెలలు గడిచిన నేటికి ముఖ్యమంత్రి 12వ పీఆర్‌సి కమిటి చైర్మన్ నియమించలేదని , వెంటనే పీఆర్‌సి కమిటిని వేసి 29 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 4 డిఏలు ప్రకటించాలన్నారు. సీపిఎస్ రద్దు చేయాలని, మెమో 57 అమలు చేసి 2003 డిఎస్సీ వారికి పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. ఎంటిఎస్ టీచర్లను కెజిబివి కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేయాలని , ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంభాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణంరాజు, సురేంద్రరెడ్డి, శ్రీనివాసులు, సుబ్రమణ్యంరెడ్డి, సహదేవయ్య, జగన్‌మోహన్‌రెడ్డి, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
Tags: Teachers Stage Protests Demanding Resolution of Issues