గాయాలతో ఆసుపత్రికి తరలింపు
ఆసిఫాబాద్ ముచ్చట్లు:
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం తలండి గ్రామంలో శుక్రవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది.
కొర్యంగ జ్యోతి అనే మహిళపై ఆమె అన్న వరుసైన తిరుపతి గొడ్డలితో దాడి చేశాడు. చిన్నపాటి ఘర్షణ తలెత్తడంతో ఆగ్రహానికి లోనైన తిరుపతి ఇంట్లోని గొడ్డలితో జ్యోతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ముందుగా తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల మీదుగా వరంగల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Tags: Woman attacked with an axe at night