మదనపల్లి ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ పథకాన్ని విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో శనివారం విజయవాడలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీల అవార్డును అందుకున్నారు.
2025 మే 23 నుంచి నెల రోజులు పాటు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీల లలో 9 మున్సిపాలిటీలు అవార్డుకు ఎంపికయ్యాయి. మదనపల్లి మున్సిపాలిటీ తరఫున కమిషనర్ ప్రమీల నేడు షీల్డ్ ని సీఎం చంద్రబాబు నుంచి అందుకున్నారు.మున్సిపాలిటీకి అవార్డు రావడంతో కమిషనర్ ప్రమీలకు పలువురు మహిళా సంఘాలు మున్సిపల్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.
Tags: Madanapalle Municipal Commissioner received the award from the Chief Minister.