July 18, 2026
Explore
బాణసంచా కర్మాగారంలో పేలుడు..

బాణసంచా కర్మాగారంలో పేలుడు..

July 18, 2026 | Andhra Pradesh

ఎనిమిదిమంది మృతి

గుజరాత్ ముచ్చట్లు:

గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నగర శివారులోని రామోల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఫ్యాక్టరీ లైసెన్సు రద్దు చేసినప్పటికీ.. అక్కడ అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలోనే ఓ యూనిట్లో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags: Explosion at a firecracker factory…