July 18, 2026
Explore
తెలంగాణలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు!

తెలంగాణలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు!

July 18, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావర ణం ఒక్కసారిగా మారిపోయింది. రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో 5,6 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

ముఖ్యంగా ఆసిఫా బాద్, మంచిర్యాల, జయశంకర్ భూపా లపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమ కొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి,తో పాటు.. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి, జిల్లాలో నూ అక్కడ క్కడా అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అధికా రులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుం టున్నారు. కాగా, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Tags: Heavy rains in Telangana over the next 24 hours!