July 18, 2026
Explore
ఏటిఎం చోరీ విఫలం

ఏటిఎం చోరీ విఫలం

July 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని కొత్తయిండ్లలో గల హిటాచిమోటార్స్ ఏటిఎంలో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. జాతీయ రహదారిపై ఉన్న ఏటిఎంలో దొంగలు పడి పగులగొట్టే ప్రయత్నం చేశారు. కానీ విఫలం కావడంతో ఎలాంటి నష్టము జరగలేదు. దొంగలు అక్కడి నుంచి పరారైయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో క్లూస్‌టీమ్‌ సంఘటన స్థలాన్ని సందర్శించి, వేలిముద్రలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారిపై ఉన్న ఏటిఎంలో దొంగలు పడటంతో ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారు.

Tags: ATM theft attempt foiled