మున్సిపాలిటిలో విచిత్రపాలన
పుంగనూరుముచ్చట్లు:
మనోడైతే చెప్పు…..ఒకే…నచ్చినచోట ఇన్‌చార్జ్గా నియమిస్తా….లేదంటే నోసీట్…అనే రీతిలో మున్సిపాలిటిలో కమిషనర్ పరిపాలన విచిత్రంగా సాగుతోంది. పాలకవర్గం పదవికాలం పూర్తికావడంతో పరిపాలన గాడితప్పింది. అధికారులు తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తుండటంతో ప్రజల కష్టాలు తీర్చేవాడే కరువైయ్యారు. స్పెషలాఫీసర్‌గా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ను ప్రభుత్వం నియమించింది. కానీ ఎస్‌వో దృష్టికి తీసుకుని వెళ్లకుండానే నిర్ణయాలు తీసుకుని , అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటికి డీఈఈగా మదనపల్లెకి చెందిన గోపినాథ్ గత పదిహేనురోజుల క్రితం బదిలీపై వచ్చారు. ఆయన నచ్చలేదు….సరికదా జాయిన్ చేసుకోవడానికి కూడ అధికారులకు మనసురాలేదు. కారణం మనోడు కాదని. డీఈఈ ని అలాగే వెనక్కుపంపేశారు. ఏఈకి ఇన్‌చార్జ్ డీఈఈ బాధ్యతలు అప్పగించారు.
7 నెలల క్రితం ….
మున్సిపాలిటికి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా గత 7 నెలల క్రితం జనవరి 20వ తేదీన మున్సిపల్ కార్మికుడుగా ఉన్న నవరత్న కు పదోన్నతి కల్పించి, ప్రభుత్వం మున్సిపాలిటి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా నియమించింది. గతంలో కార్మికుడిగా పని చేసిన నవరత్న కు పదోన్నతి రావడంతో కార్మికులు, పట్టణ ప్రజలు కూడ హర్షం వ్యక్తం చేశారు. అనుభవంతో పారిశుద్ద్య కార్యక్రమాలు మెరుగుపడుతుందని ఆశించారు. కానీ కమిషనర్ నిర్వాకంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా 7 నెలల క్రితం బాధ్యతలు చేపట్టినా అతనికి కుర్చీ ఇవ్వకుండ , కార్మికుడిగానే కొనసాగిస్తూ , గుమాస్తాగా ఉన్న వెంకటప్పతో అనధికార విధులు నిర్వహించడం విమర్శలకు దారితీస్తోంది. వర్కర్‌కు పదోన్నతి రావడాన్ని అధికారులు జీర్ణించుకోలేక , ఆయనకు కుర్చీ ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు ఇకనైన బాధ్యతలు అప్పగిస్తారా…లేక మున్సిపాలిటి తనదేనని వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.

Tags: If it’s our guy, then it’s a ‘yes’… otherwise, no seat.