July 18, 2026
Explore
మానవ మనుగడకు కూరగాయలు ఎంతో అవసరం

మానవ మనుగడకు కూరగాయలు ఎంతో అవసరం

July 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మానవుని మనుగడకు ఆకుకూరలు , కూరగాయలు ఎంతో అవసరమని రాయలసీమచిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం పాఠశాలలో గ్రీన్‌డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పచ్చదనంతో కూడిన దుస్తులు ధరించారు. మనిషికి పోషక విలువలను అందించే ఆకుకూరలు, కూరగాయలపై క్వీజ్‌ పోటీలు నిర్వహించి, బహుమతులు పంపిణీ చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు పచ్చదనం పెంపొందించాలని, ఇందుకోసం ప్రతి ఇంట రెండు వెహోక్కలు నాటాలని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రజిని, జలజ, షాహిన, రేఖ, రెడ్డెమ్మ, రేణుక, సత్య, లక్ష్మీ, ముభారక్‌, శివశంకర్‌, అమృత, ప్రశాంతి, వనజ తదితరులు పాల్గొన్నారు.

Tags: Vegetables are essential for human survival.