పుంగనూరుముచ్చట్లు:
రిజిస్ట్రేషన్లను ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జివో 396 ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20 నుంచి డాక్యుమెంట్‌రైటర్ల పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. శనివారం సంఘ నాయకులు పూలత్యాగరాజు, రామమూర్తి లు విలేకరులతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌లో ప్రైవేటు భాగస్వామాన్ని నిరోధించాలన్నారు. తక్షణమే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈనెల 20 నుంచి 31 వరకు నిరవధికంగా పెన్‌డౌన్ చేసి, ప్రభుత్వానికి నిరసన తెలుపుతామన్నారు. ప్రభుత్వం అప్పటికి స్పందించకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ మేరకు సబ్‌రిజిస్ట్రార్ సర్వేశ్వరరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పవన్‌కుమార్, ఖలీల్, శ్రీనివాస్, భానుమూర్తి, రవిచంద్ర, కుమార్, రెడ్డెప్ప, శ్రీధర్‌రావు, నాగరాజ, సద్దామ్‌హుసేన్, కృష్ణవేణి, శిల్ప, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: Document writers to go on pen-down strike from the 20th.