పుంగనూరుముచ్చట్లు:
క్షయవ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డాక్టర్లు, సిబ్బంది కోరారు. మంగళవారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నందు ప్రపంచ టీబి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ హరగోపాల్ మాట్లాడుతూ టీబిని సరైన సమయంలోగుర్తిస్తే ఉచితంగా పూర్తి స్థాయి చికిత్స అందుబాటులో ఉంటుందని, లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోను నిర్లక్షం చేయవద్దని సూచించారు. మైకోబాక్టిరీయం ట్యూబర్‌క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా వల్లన కలిగే ఈ అంటువ్యాధి గాలి ద్వారా వ్యాపిస్తుందని, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా నివారించవచ్చనని తెలిపారు. దగ్గు, చాతినొప్పి, శ్వాసతీసుకోవడం, బరువు తగ్గడం టీబి లక్షణాలుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మధుసూదన్, హిమశైలజ, భారతి, మధుబాల, సిద్దార్థరెడ్డి, ప్రవీన్, దీపిక, హిమవంత్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Tuberculosis must be eradicated.