పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఎస్.తూభ, ఈ.అమృత లకు షైనింగ్‌స్టార్ అవార్డు లభించినట్లు శనివారం ప్రిన్సిపాల్ గల్లా గంగాధర్‌నాయుడు తెలిపారు. వీరు పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధించినందుకు వీరికి ఈ నెల 20వ తేదీన మదనపల్లెలో జరిగే సమావేశంలో డీఈవో వీరికి అవార్డులతో పాటు ప్రశంసాపత్రాలు , నగదు అందించనున్నారు. ఈ సందర్భంగా అవార్డు అందుకోబోతున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పలువురు అభినందించారు.

Tags: ‘Shining Star’ Award for Thoobha and Amrutha