July 18, 2026
Explore
లోక్‌అదాలత్‌లో 7 కేసులు పరిష్కారం

లోక్‌అదాలత్‌లో 7 కేసులు పరిష్కారం

July 18, 2026 | Andhra Pradesh

-రూ.37.50 లక్షల పరిహారం పంపిణీ

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని కోర్టు ఆవరణంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి పరేష్‌కుమార్‌, అడిషినల్‌ జునియర్‌ సివిల్‌జడ్జి కృష్ణవంశి కలసి శనివారం లోక్‌అదాలత్‌ నిర్వహించారు. చెక్కు కేసులను మాత్రం పరిష్కరించారు. ఇందులో 7 కేసులు పరిష్కారం కాగా, వాటి ద్వారా బాధిత కక్షిదారులకు రూ.37.50 లక్షలు పరిహారం పంపిణీ చేయించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, ఏజిపి సురేష్‌కుమార్‌, న్యాయవాదులు సివి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags: 7 cases settled in Lok Adalat