July 18, 2026
Explore
కూలే దిశలో డిగ్రీ చదువులు..!

కూలే దిశలో డిగ్రీ చదువులు..!

July 18, 2026 | Andhra Pradesh

18 ఏళ్లుగా పెచ్చులూడిన భవనాల్లో

చినుకుపడ్డ.. ఆకు కదిలినా భయం భయం..!!

పేద విద్యార్థుల పాట్లు వర్ణనాతీతం..

సత్యవేడు ముచ్చట్లు:

టిడిపి అధికారంలో ఉంటే… అభివృద్ధి పరుగులు పెడుతుంది… ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి… అధికారుల పనితీరులో క్రమశిక్షణ, పేదలను ఆదుకోవడం, అక్రమాలను సహించడం జరగదు అన్నది ప్రజల విశ్వాసం.. అయితే తమిళనాడుకు సరిహద్దులో ఉన్న సత్యవేడు నియోజకవర్గంలో పరిస్థితి పూర్తిగా తలకిందులుగా మారిపోయింది అధికార పార్టీకి చెందినవారు ఆధిపత్య, అధికార దాహానికి పోటీ పడుతూ…. మన వాడికి, మనతో వచ్చిన వాడికి ఏంటి లాభం..? వాళ్ళందరూ మనతో ఉండాలి… ఇందుకోసం ఎంతటి తెగింపుకైనా దిగి పేదలు, బాధితులకు అన్యాయం జరిగినా పర్వాలేదు… అనే విధంగా వ్యవహరిస్తున్నారు కనీసం పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూలే ప్రమాద స్థితిలో ఉన్న పట్టించుకునే దిక్కులేదు క్షణక్షణం.. భయం భయం మధ్య ఇక్కడ విద్యాబోధన సాగుతోంది

18 ఏళ్లుగా పాడుబడ్డ భవనంలోనే..

సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2008 సంవత్సరంలో పూర్వపు తెలుగు గంగ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రారంభించారు అప్పటినుంచి ఇప్పటివరకు కొత్త తరగతి గదులు లేకపోగా వసతులు పూర్తిగా దూరమయ్యాయి ఈ భవన సముదాయం పూర్తిగా దుస్థితికి చేరింది చినుకుపడ్డ… ఆకు కదిలిన ఇక్కడ అధ్యాపకులు, విద్యార్థులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళనతో కాలాన్ని నెట్టేస్తున్నారు ఇక్కడ సుమారు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఎప్పుడో నిర్మించిన ఈ సముదాయ ప్రాంతం పెచ్చులూడిపోతున్నాయి ఈ భవనానికి నిర్మించిన పిల్లర్లు పూర్తిగా దృష్టికి చేరింది 18 సంవత్సరాలుగా వసతులు కల్పించాలని ఇక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాలకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్న ఫలితం శూన్యం ప్రస్తుతం కళాశాలలో బి ఏ, బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ కోర్సులు నిర్వహిస్తున్నారు

ఏడు ఎకరాలు
జగనన్న కాలనీ కి సమర్పియామీ..!

అప్పటి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కే నారాయణ స్వామి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెప్పించి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు నూతన భవన సముదాయం కొరకు సత్యవేడు సమీపంలోని కొత్త మారి కుప్పంలో సర్వేనెంబర్ 388-6 లో సుమారు 7 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది అయితే 2020 సంవత్సరంలో ఈ భూములను ఆగ మేఘాలపై జగనన్న కాలనీకి కేటాయించడం జరిగింది అప్పటినుంచి డిగ్రీ కళాశాలకు భూముల కేటాయింపు వ్యవహారం జరగలేదు. కొత్తగా భూ కేటాయింపు, తద్వారా తరగతి గదులు నిర్మించి విద్యార్థుల ఇబ్బందులు తొలగించే విషయంలో అడుగడుగునా జాప్యం జరుగుతూనే వస్తోంది.

అన్నీ ఉన్నా… శని అన్నట్లు..!

ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరుతో భూ కేటాయింపు లేకపోవడం పేద విద్యార్థులకు శాపంగా మారింది అప్పట్లో కేటాయించిన భూములను జగనన్న కాలనీకి సమర్పించారు ఆ తర్వాత డిగ్రీ కళాశాల విషయాలపై పట్టించుకునే దిక్కు లేదు దీనికి తోడు దాతలు, యు డి సి కింద, ఇతర వారి నుంచి నిధులు రాబట్టుకుని తరగతి గదులు నిర్మించుకోవాలన్నా… భూ సమస్య తీవ్రంగా మారింది శ్రీ సిటీ పక్కనే ఉండటం వల్ల డిగ్రీ చదువులు పూర్తి చేసుకుని ఉపాధి అవకాశాలు పొందేందుకు పేద విద్యార్థులు ఆసక్తిగా ఉన్నారు అయితే ప్రభుత్వం నుంచి ప్రజా ప్రతినిధుల నుంచి స్పందన లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

కలెక్టర్ సారూ కనికరించండి..

నిరవధికంగా మూడు రోజులు పాటు వర్షం కురిస్తే.. సత్యవేడు డిగ్రీ కళాశాలకు సెలవు ప్రకటించాల్సిందే.. ఎందుకంటే ఏ భవనం ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది అందువల్ల జిల్లా అధికారులు, కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి డిగ్రీ కళాశాలకు యుద్ధ ప్రాతిపదికన ఐదు నుంచి ఏడు ఎకరాల వరకు కేటాయిస్తే… మరో మూడు మాసాల్లో నూతన తరగతి గదులు నిర్మించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags: Degree education on the verge of collapse..!