July 18, 2026
Explore
ప్రతిభావంతులైన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు

ప్రతిభావంతులైన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు

July 18, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డ్స్–2026ను ఈ నెల 20న కడప మాధవి కన్వెన్షన్‌లో ప్రదానం చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, ప్రశంసాపత్రం అందజేస్తారు. ప్రతి మండలం నుంచి ఆరుగురు ప్రతిభావంతులైన విద్యార్థులతో పాటు దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. సుండుపల్లె నుంచి ఏడుగురు విద్యార్థులు ఎంపికకు అర్హులైనట్లు విద్యాశాఖ అధికారి వెంకటేష్ నాయక్ తెలిపారు. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించి విద్యా ప్రమాణాలను పెంపొందించడమే ఈ అవార్డుల లక్ష్యమన్నారు.

Tags: Shining Star Awards for Talented Students