పీలేరు ముచ్చట్లు:
దేశవ్యాప్తంగా విడుదలైన నీట్ ఫలితాల్లో పీలేరు పట్టణానికి చెందిన డి. రోహిత్ రాజు ప్రతిభ చాటాడు. 720 మార్కులకు 680 మార్కులు సాధించి ఆల్ ఇండియా 316వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. పీలేరు క్రాస్‌రోడ్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు డి. పరమేశ్వర రాజు కుమారుడైన రోహిత్ విజయం కుటుంబంతో పాటు ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన రోహిత్ సాధించిన ఈ ఘన విజయంపై కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.
Tags: Rohit, a student from Pileru, secured All India Rank 316 in NEET.