July 18, 2026
Explore
ఓపెన్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలి: శ్రీనివాసరాజు

ఓపెన్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలి: శ్రీనివాసరాజు

July 18, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా 2026–27 విద్యాసంవత్సరానికి ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు జిల్లా కోఆర్డినేటర్ కొండూరు శ్రీనివాసరాజు తెలిపారు. రాయచోటి డైట్‌లో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ, చదువు మధ్యలో నిలిపివేసిన వారు, పదో తరగతి లేదా ఇంటర్‌లో ఫెయిల్ అయినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

జూలై 31 వరకు అపరాధ రుసుము లేకుండా ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలు లేదా గుర్తింపు పొందిన అభ్యసన కేంద్రాల ద్వారా ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఓపెన్ స్కూల్‌లో ఉచిత పాఠ్యసామగ్రి, వారాంతపు తరగతులు, ఐదేళ్లలో తొమ్మిది పరీక్షా అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Tags: Make good use of open school admissions: Srinivasaraju