July 18, 2026
Explore
పీలేరు పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు

పీలేరు పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు

July 18, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పారదర్శక పాలన, నాణ్యమైన పౌర సేవలకు గుర్తింపుగా పీలేరు గ్రామ పంచాయతీకి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ లభించింది. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో మౌలిక వసతుల అభివృద్ధి, రికార్డుల డిజిటలైజేషన్, వేగవంతమైన సేవలందింపులో ప్రతిభ కనబరిచిన పంచాయతీకి ఈ గౌరవం దక్కింది. తాడేపల్లిలో పంచాయతీ రాజ్ కమిషనర్ ఎం.వి. కృష్ణతేజ పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ జ్ఞానశేఖర్‌కు ఐఎస్ఓ సర్టిఫికెట్ అందజేశారు. అన్నమయ్య జిల్లాలో ఈ గుర్తింపు పొందిన తొలి గ్రామ పంచాయతీగా పీలేరు నిలిచింది.

Tags:ISO recognition for Pileru Panchayat