July 18, 2026
Explore
అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకునే చంపిన తండ్రి..

అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకునే చంపిన తండ్రి..

July 18, 2026 | Andhra Pradesh

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనమే ఈ విషాదానికి కారణమా?

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్‌ల వేధింపులతో మానసికంగా కుంగిపోయిన కుమారుడు వంశీకృష్ణ ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి వసుంధర రావు కర్రతో దాడి చేసి హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉన్న వంశీకృష్ణ ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు బానిసగా మారి మానసిక స్థితి సరిగా లేక తల్లిదండ్రులను వేధిస్తుండడంతో విసుగు చెందిన తండ్రి వసుంధర రావు.. కొడుకు వంశీకృష్ణ తలపై కర్రతో కొట్టి చంపాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న తండ్రి వసుంధర రావును శుక్రవారం పోలీసుల అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ బి సబ్ జైలుకు రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీసుల కథనం మేరకు బెట్టింగ్ ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడిన వంశీకృష్ణ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. సుమారు రెండు లక్షల వరకు రుణాలు పొందాడు. అయితే లోన్ యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి రుణం చెల్లించాలని ఒత్తిడి చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురైన వంశీకృష్ణ.. కృంగిపోయి మానసిక రోగిగా మారాడు. తల్లిదండ్రులను వేధించేవాడు. గత కొన్ని నెలలుగా వంశీకృష్ణ ప్రవర్తన తల్లిదండ్రులకు విసుగు తెప్పిస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల ఏడో తారీఖున రాత్రి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ , టీవీ ,సెల్ ఫోన్ వంటి వస్తువులను పగలగొట్టి తల్లిదండ్రులతో గొడవకు పడి దాడి చేశాడు. ఈ క్రమంలో తీవ్ర విసుగు చెందిన తండ్రి ఒక్కసారిగా కొడుకుపై కర్రతో బలంగా దాడి చేశాడు. దీంతో వంశీకృష్ణ మృతి చెందాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు.. గ్రామానికి చేరుకుని జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడుని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకుడుని చేయాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉన్నత విద్యాభ్యాసం కొరకు బెంగళూరు నగరానికి పంపించారు. ఇక్కడే వంశీకృష్ణ చెడు అలవాట్లకు బానిసగా మారాడు. ఆన్‌లైన్ బెట్టింగులకు బానిసగా మారాడు. లోన్ యాప్ ద్వారా లక్షల్లో అప్పులు చేశాడు. అప్పులు కట్టలేక మానసికంగా కుంగిపోయి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే వంశీకృష్ణను కన్న తండ్రి హత్య చేయాల్సిన దారుణ పరిస్థితులకు దారితీసింది.

కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామానికి చెందిన వసుంధరరావు, లీలావతికి ఇద్దరు సంతానం. కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె ఉమాదేవి ఉన్నారు. ఉమాదేవి బీఫామ్ చదువుతుండగా, కుమారుడు వంశీకృష్ణను బెంగళూరులో చదివిస్తున్నారు. బీసీఏ డిగ్రీ పూర్తి చేసిన వంశీకృష్ణ.. ఇటీవలే ఇంటికి వచ్చాడు. లోన్ యాప్ ద్వారా కుమారుడు అప్పులు చేయడంతో రూ .40 వేల వరకు లోన్ ఆప్పులు కట్టామని తల్లి లీలావతి పేర్కొంటున్నారు. మళ్ళీ లక్ష రూపాయలు అప్పు కట్టాలంటూ వంశీకృష్ణకు ఫోన్ చేసిన లోన్ యాప్ ప్రతినిధులు ఒత్తిడి చేశారు. దీంతో వంశీకృష్ణ.. తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు.

లోన్ యాప్ వేధింపులతో తమ కుమారుడు మానసిక స్థితి సరిగా లేక తమపై వేధించేవాడని తల్లి లీలావతి చెప్పారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న సీఐ హనుమంతు నాయక్, ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి గ్రామానికి చేరుకుని ఈ ఘటనపై విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కన్న తండ్రే కుమారుని హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. వంశీకృష్ణ తండ్రి వసుంధర రావు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆళ్లగడ్డ సబ్ జైలుకు నిందితుడు వసుంధర రావును తరలించారు.

Tags: A father who killed the very son he had raised with such doting affection…