July 18, 2026
Explore
బంగారం ధరల్లో మళ్ళీ దూకుడు

బంగారం ధరల్లో మళ్ళీ దూకుడు

July 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

స్థిరంగా వెండి!..

బంగారం ధరలు మళ్లీ పైకి ఎగబాకాయి.గత కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు,శనివారం నాటి మార్కెట్‌లో భారీగా పెరిగాయి.మరోవైపు, వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.

​పసిడి ధరల పరుగు..

స్థానిక బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
​22 క్యారెట్ల బంగారం: పది గ్రాముల ధరపై ₹700 పెరగడంతో, ప్రస్తుతం రూ.1,31,350 వద్ద ట్రేడ్ అవుతోంది.
​24 క్యారెట్ల బంగారం: స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా ₹760 పెరిగి, రూ.1,43,290కు చేరింది.

​స్థిరంగా వెండి..

బంగారం ధరలు పెరుగుదల దిశగా పయనిస్తుంటే, వెండి ధరలో మాత్రం ఎటువంటి కదలిక లేదు. కిలో వెండి ధర రూ.2,35,000 వద్దే స్థిరంగా కొనసాగుతూ వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది.
​ప్రస్తుత పండగ సీజన్, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పెట్టుబడిదారులు మరియు కొనుగోలు దారులు ధరల మార్పులను గమనిస్తూ అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: Gold prices surge again.