July 18, 2026
Explore
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 24వ తేదీన 104 వాహనాలు ఆన్లైన్ వేలం

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 24వ తేదీన 104 వాహనాలు ఆన్లైన్ వేలం

July 18, 2026 | Andhra Pradesh

శ్రీకాకుళం ముచ్చట్లు:

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని 104 సంచార వైద్య విభాగం ఎంఎంయూకు చెందిన 20 పాత వాహనాలను ఈ నెల 24వ తేదీన ఆన్లైన్లో వేలం వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జి అధికారి డాక్టర్ శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కొనుగోలు పోర్టల్ ద్వారా జూలై 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ వేలం పాట ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆసక్తి గల కొనుగోలుదారులు, కాంట్రాక్టర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Tags: Online auction of 104 vehicles in Srikakulam district on the 24th of this month.