July 18, 2026
Explore
భర్తను చంపించినభార్యా

భర్తను చంపించినభార్యా

July 18, 2026 | Andhra Pradesh

బీహార్ ముచ్చట్లు:

పెళ్లయ్యాక భార్యను కష్టపడి చదివించి, ఆమెను పరీక్షలకు ప్రిపేర్ చేసి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యేటు చేస్తే, అధికారి హోదా పొందిన తర్వాత ఆమె భర్తను చంపించింది. భార్యాభర్తల సంబంధానికి, పవిత్ర వివాహ వ్యవస్థకు, మానవత్వానికి మచ్చ తెచ్చే ఘోరమిది. బీహార్ లో దేవకుమార్ అనే వ్యక్తి రైల్వే డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిషన్ గా పని చేస్తున్నాడు. అతడి భార్య సమిత కుమారి బ్రేక్ ఇన్స్పెక్టర్గా పని చేస్తుంది. ఆమెకు అజిత్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ప్రేమగా మారి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. భర్త ఉద్యోగం తన హోదాకు తగ్గట్టుగా లేదని భర్తను చంపేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రియుడికి చెప్పి భర్త డ్యూటీ నుంచి రైల్లో తిరిగి వస్తుండగా రైల్లోనే షూట్ చేయమని ప్లాన్ ఇచ్చింది. దీంతో ప్రియుడు అజిత్ కుమార్ కాంట్రాక్టు కిల్లర్స్ ను కుదుర్చుకుని రైల్లోనే దేవకుమార్ను తుపాకీతో కాల్చి పరారయ్యారు. హాస్పిటల్లో రెండు రోజులు పాటు చికిత్స తర్వాత దేవకుమార్ చనిపోయాడు. ఈ కేసు పోలీసులకు ఒక సవాలుగా మిగిలింది. అధికారులు రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులను ఉమ్మడిగా కేసు దర్యాప్తు చేయమని ఆదేశించారు. దీంతో కేసు ఒక వ్యూహాత్మకంగా దర్యాప్తు చేస్తే చివరకు భార్య సమిత కుమారి కుట్ర బయటపడింది. దీంతో ఆధారాలతో ఆమెను ప్రియుడు అజిత్ కుమార్ ని కాంటాక్ట్ కిల్లర్లు ఇద్దరిని మొన్ననే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

Tags:A wife who had her husband killed