మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో టెంకాయలు పూజ సామాగ్రి ఉన్న మూడు దుకాణాలకు నిప్పు పెట్టడంతో రూ.5లక్షల టెంకాయలు, ఇతర సామాగ్రి కాలిపోయింది. బాధితులు బావజాన్, సౌకత్ కథనం మేరకు.. శుక్రవారం అర్థరాత్రి తమ దుకాణాలకు ఎవరో నిప్పు పెట్టారన్నారు. అగ్ని మాపక అధికారి శివప్ప వెంటనే సిబ్బందితో ప్రమాద స్థలంకు చేరుకుని కొబ్బరికాయల దుకాణంలో మంటలను అదుపుచేసినట్లు తెలిపారు. సుమారు 70 ఏళ్లుగా నడుపుతున్న దుకాణాల్లో రూ 5లక్షల కొబ్బరి కాయలు, ఇతర ఫర్నిచర్ కాలిపోయిందని చెప్పారు.
Tags: Three shops set on fire in Madanapalle; property worth ₹5 lakh lost.