విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని గిరిపురంలో డయేరియా విజృంభిస్తోంది.
రెండు వీధులకు చెందిన దాదాపు 20 మంది డయేరియా బారిన పడ్డారు. కుళాయిల నుంచి కలుషిత నీరు వస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని, స్థానికంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, గురువారం రాత్రి ఒకేసారి ఐదుగురు డయేరియా బాధితులను గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం రెండేళ్ల చిన్నారికి విరోచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
Tags; Diarrhea outbreak in Vijayawada