July 18, 2026
Explore
శ్రీసిటీకి చేరుకున్న మంత్రి నారా లోకేష్..

శ్రీసిటీకి చేరుకున్న మంత్రి నారా లోకేష్..

July 18, 2026 | Andhra Pradesh

శ్రీసిటీ ముచ్చట్లు:

విక్రమ్-1 రాకెట్ ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి..

రాష్ట్ర ఐటీ,ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శ్రీసిటీకి చేరుకున్నారు.ఆయన పర్యటన సందర్భంగా స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు.

​శ్రీహరికోటకు పయనం..

శ్రీసిటీలో పర్యటన ముగించుకున్న అనంతరం,మంత్రి నారా లోకేష్ రోడ్డు మార్గం ద్వారా శ్రీహరికోటకు బయలుదేరారు.
​చారిత్రాత్మకప్రయోగానికి సాక్షిగా..నేడు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘విక్రమ్-1’ రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇది దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ప్రయోగం కావడం విశేషం. అంతరిక్ష రంగంలో భారత ప్రైవేట్ సంస్థల ప్రస్థానానికి ఈ ప్రయోగం ఒక మైలురాయిగా నిలవనుంది.​ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో అంతరిక్ష సాంకేతికతను ప్రోత్సహించడంలో భాగంగా ఆయన ఈ ప్రయోగంను వీక్షించనున్నారు.

Tags: Minister Nara Lokesh has arrived at Sri City.