July 18, 2026
Explore
సంబేపల్లిలో పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

సంబేపల్లిలో పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

July 18, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు:

సంబేపల్లి మండలం మాదం వాండ్లపల్లి సమీపంలోని పొలాల వద్ద నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఎస్సై రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,530 నగదు, మూడు సెల్‌ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags: Raid on gambling den in Sambepalli; seven arrested.