July 18, 2026
Explore
పల్నాడు జిల్లాలో ‘తల్లికి వందనం’ లబ్ధిదారులకు అలర్ట్..

పల్నాడు జిల్లాలో ‘తల్లికి వందనం’ లబ్ధిదారులకు అలర్ట్..

July 18, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

గడువులోగా బ్యాంక్ ఖాతాలు తెరవాలి..

పల్నాడు జిల్లాలో ‘తల్లికి వందనం’ పథకం కింద ఉపకార వేతనాలు,ఫీజు రాయితీలను నేరుగా పొందేందుకు అర్హులైన ఎస్సీ విద్యార్థులు వెంటనే బ్యాంక్ లేదా పోస్టల్ ఖాతాలను ప్రారంభించుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి ఎం.లక్ష్మయ్య శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

​అర్హులైన విద్యార్థులకు సూచనలు..

ఈ విద్యా సంవత్సరం (2026-27)లో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సుల్లో చేరిన ఎస్సీవిద్యార్థులు, పది ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వం ఈ నెల 22న నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేయనున్న నేపథ్యంలో,ఇప్పటివరకు ఖాతాలు లేని వారు అత్యవసరంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

​ఖాతా తెరవాల్సిన విధానం..

​గడువు: ఈ నెల 19వ తేదీ లోపు దగ్గర్లోని పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరవాలి.

​చార్జీలు ఖాతా ప్రారంభానికి రూ. 200 చెల్లించాలి.

​కావలసిన పత్రాలు: ఆధార్ కార్డు, పదో తరగతి మార్కుల జాబితా (లేదా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం) మరియు మొబైల్ ఫోన్ నంబరును వెంట తీసుకెళ్లాలి.

​సందేహాల కోసం సంప్రదించాల్సినవి:.

పథకంపై ఏవైనా సందేహాలు ఉంటే నరసరావుపేటలోని జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారికార్యాలయంలోని పర్యవేక్షకులు కె. శ్రీనివాసరావు (9989943408) లేదా సిహెచ్. శివప్రసాద్ (8142766370)ను సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు.అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారి ఎం.లక్ష్మయ్య సూచించారు.

Tags; Alert for ‘Thalliki Vandanam’ beneficiaries in Palnadu district.