July 18, 2026
Explore
నూలివీడులో విజయనగర కాలం నాటి శాసనం గుర్తింపు

నూలివీడులో విజయనగర కాలం నాటి శాసనం గుర్తింపు

July 18, 2026 | Andhra Pradesh

నూలివీడు ముచ్చట్లు:

గాలివీడు మండలం నూలివీడు పంచాయతీ కొత్తబండివాండ్లపల్లి సమీపంలో విజయనగర చక్రవర్తి రెండవ వెంకటపతి రాయల కాలానికి చెందిన శాసనాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు గుర్తించారు. శుక్రవారం ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూలివీటి రెడ్డి, కరణాలకు ఇచ్చిన చెరువు, కుంట, కాలువలకు సంబంధించిన వివరాలు ఈ శాసనంలో ఉన్నట్లు తెలిపారు. ఈ శాసనం సుమారు క్రీ.శ. 1527–1605 కాలానికి చెందినదిగా అధికారులు పేర్కొన్నారు.

Tags: Vijayanagara-era inscription identified in Nooliveedu.