గాలివీడు ముచ్చట్లు:
గాలివీడులోని హైస్కూల్ సమీపంలోని పూసల కాలనీలో గురువారం రాత్రి ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు నగలు, నగదు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. చెప్పలి అలియాస్ కూరగాయల చంద్ర, రాణమ్మలు గత 40 ఏళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఈ క్రమంలో కుమారుడు ఉద్యోగంలో స్థిరపడగా, రామచంద్ర సంతల్లో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో పాటు కుమారుడి వివాహానికి అత్త ఇచ్చిన బంగారు ఆభరణాలను ఇంట్లోని బీరువాలో భద్రపరచి సంతకు వెళ్లారు.
ఈ క్రమంలో గురువారం కోనంపేట సంతకు వెళ్లి తిరిగి రావడానికి బస్సు లేక కుమార్తె ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తలుపులు, బీరువా పగులగొట్టి 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు దోచుకెళ్లినట్లు గుర్తించారు.
సంఘటనను గమనించిన రామచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా లక్కిరెడ్డిపల్లి సీఐ, గాలివీడు ఎస్ఐ సిబ్బంది డాగ్ స్క్వాడ్‌తో వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Tags: Theft at home… 30 tolas of gold and ₹50,000 in cash stolen.