పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్ ఎంఈసీ చదువుతున్న కావాడి అక్షిత షైనింగ్‌స్టార్ అవార్డు కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రమ తెలిపారు. శుక్రవారం రాత్రి ఆమె ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీన మదనపల్లెలో జరిగే సమావేశంలో డీఈవో అక్షితకు అవార్డులతో పాటు ప్రశంసాపత్రం, నగదు అందించనున్నారు. ఈ సందర్భంగా అవార్డుకు ఎంపికైన అక్షితను ప్రిన్సిపాల్, సిబ్బంది, తల్లిదండ్రులు అభినందించారు.
Tags: ‘Shining Star’ Award for Model School Student Akshitha