భద్రాచలం ముచ్చట్లు:
నాదెండ్ల మండలం గణపవరంలోని కెల్లంపల్లి భద్రాచలం జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం, గుంటూరు కేర్ డెంటల్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం ఘనంగా జరిగింది. ఈ శిబిరంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ వి. అవినాష్, డాక్టర్ భార్గవి బృందం సుమారు 700 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే, నోటి పరిశుభ్రత, దంత సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కాపు వెంకటరావు మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుంచే దంతాల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. క్లబ్ అధ్యక్షుడు లంకా ఆదినారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి పోపురి వెంకట రమణ, ఇతర రోటరీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రామీణ విద్యార్థుల కోసం భవిష్యత్తులోనూ ఇటువంటి సేవలు కొనసాగిస్తామని రోటరీ ప్రతినిధులు తెలిపారు.
Tags; Free dental check-ups for 700 students in Ganapavaram.