వాయల్పాడు ముచ్చట్లు:
కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు అనంతరం ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తో కలిసి శుక్రవారం వాయల్పాడు, గుర్రంకొండ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. బాధితులతో మర్యాదగా ప్రవర్తించి సత్వర న్యాయం అందించాలని సిబ్బందికి సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళా భద్రత, సీసీ కెమెరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలాన్లను వేగంగా పరిష్కరించాలని, పోలీసు స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ రాఘవరెడ్డి, ఎస్ఐలు తిప్పేస్వామి, రవీంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags: DIG visited the Vayalpadu and Gurramkonda police stations along with the SP.