July 17, 2026
Explore
16వ తేదీ ఒక దినపత్రిక నందు ప్రచురించిన ‘‘శ్రీ పద్మావతి అమ్మవారి తిరువాభరణాల పెట్టెకు భద్రత కరువు “ అనే వార్త వాస్తవదూరం.

16వ తేదీ ఒక దినపత్రిక నందు ప్రచురించిన ‘‘శ్రీ పద్మావతి అమ్మవారి తిరువాభరణాల పెట్టెకు భద్రత కరువు “ అనే వార్త వాస్తవదూరం.

July 17, 2026 | Uncategorized

తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు, ఆలయ సమీపంలోని శుక్రవారపు తోట (ఫ్రైడే గార్డెన్) నందు అమ్మవారి ఉత్సవ మూర్తులకు వైభవంగా “స్నపన తిరుమంజన అభిషేకం” కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందుకోసం అమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రధాన ఆలయం నుండి శుక్రవారపు తోటకు తరలిస్తారు.

ఈ అభిషేక సమయానికి ముందే పూజా సామాగ్రితో పాటు ఒక ఖాళీ చెక్క పెట్టెను కూడా శుక్రవారపు తోటకు తీసుకువెళ్లడం జరుగుతుంది.

అభిషేకానికి ముందు అమ్మవారి అలంకరణలో ఉన్న సువర్ణ ఆభరణాలను సడలించి (తీసి), ఆ ఖాళీ చెక్క పెట్టెలో అత్యంత భద్రంగా ఉంచుతారు. అభిషేక మహోత్సవం పూర్తయిన అనంతరం, ఆ ఆభరణాలను తిరిగి అమ్మవారికి సమర్పించి భక్తిశ్రద్ధలతో అలంకరిస్తారు.

పూజా కార్యక్రమాల అనంతరం, ఆ ఖాళీ చెక్క పెట్టెను ఉత్సవ మూర్తులతో పాటు తిరిగి భద్రంగా ప్రధాన ఆలయంలోనికి తీసుకువస్తారు.

ఆ ఖాళీ చెక్క పెట్టెను శుక్రవారపు తోటకు తీసుకుని వెళ్ళేటప్పుడు గాని వచ్చేటప్పుడు గాని ఎటువంటి భద్రత ఏర్పాటు చేయబడదు.

ప్రతి శుక్రవారం జరిగే ఈ విశేష సాంప్రదాయ క్రతువు వివరాలు ఇలా ఉండగా సదరు కథనంలో ఇందుకు పూర్తి భిన్నంగా అసత్య సమాచారాన్ని ప్రచురించారు. భక్తుల మనోభావాలు, సంస్థ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఇటువంటి వార్తలు రాయడం శోచనీయం .

Tags: The news report published in a daily newspaper on the 16th, titled “Lack of Security for Goddess Sri Padmavati’s Sacred Jewelry Casket,” is far from the truth.