July 17, 2026
Explore
జులై 17- అంత‌ర్జాతీయ న్యాయ దినోత్స‌వం

జులై 17- అంత‌ర్జాతీయ న్యాయ దినోత్స‌వం

July 17, 2026 | Uncategorized

అమరావతిముచ్చట్లు:

ప్రతి సంవత్సరం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం (International Justice Day) లేదా “అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం”గా జరుపుకుంటారు. ప్రపంచంలో శాంతి, భద్రతలను కాపాడటంలో మరియు మానవ హక్కుల రక్షణలో న్యాయవ్యవస్థ పాత్రను గుర్తుచేసే ముఖ్యమైన రోజిది.

ప్ర‌తి ఏడాది జులై 17న ప్రపంచ వ్యాప్తంగా అంత‌ర్జాతీయ న్యాయ దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంటారు.న్యాయం కోసం మద్దతు ఇచ్చేవారు, ప్రపంచంలోని శాంతి, భద్రత మరియు అభివృద్దిని కొనసాగించడానికి అన్ని రకాల నేరాలను వ్యతిరేకించే వారికి ఈ రోజు అంకితం చేయబడింది. ఈ రోజు 139 కి పైగా దేశాలలో జరుపుకుంటారు. ఈ రోజున వివిధ సంస్థలు ఈ రోజును జరుపు కోవడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తాయి మరియు ఎక్కువ మంది ప్రజలలో అవగాహన పెంచుతాయి.

అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం అని కూడా పిలుస్తారు. దీనిని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థకు గుర్తింపుగా జరుపుకుంటారు. అంత‌ర్జాతీయ నేరాల‌కు న్యాయం జ‌రిగేలా చేయడం, అంత‌ర్జాతీయంగా జ‌రిగే క్రిమిన‌ల్ జ‌స్టిస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చేలా ప్రొత్స‌హించడం మొద‌లైన‌వి ఈ దినోత్స‌వం ముఖ్యోద్దేశాలు.

చ‌రిత్ర‌:

ఒక్క అమాయకుడికి కూడా అన్యాయము జరగకూడదన్న సూత్రము న్యాయవయ్వస్థకు పునాది. అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తింపు చర్యగా ప్రతిఏటా ప్రపంచ వ్యాప్తంగా జూలై 17న అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు.
రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17ను అంత‌ర్జాతీయ న్యాయ దినోత్సవంగా 1998లో నిర్ణయంచారు. అయితే శిక్షార్హతకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించడం, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు, మారణహోమంలో బాధితులకు న్యాయం చేయడం వంటి వాటి ప్రాముఖ్యాన్ని ఈ రోజు సూచిస్తుంది. న్యాయంపై ప్రజలలో అవగాహన క‌ల్పించి ఐక్యంగా న్యాయం కోసం పోరాడేలా చేయడం. అలాగే బాధితుల హక్కులను సాధించ‌డం కోసం ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ప్రజ‌లను ప్రోత్సాహిస్తుంది. అనేక నేరాల నుండి ప్రజలను రక్షిచడంతో పాటు దేశ శాంతి, భద్రత, శ్రేయస్సుకు భంగం క‌లిగించే వ్యక్తులకు హెచ్చరిక‌గా ప‌నిచేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్‌ను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడతారు.

ల‌క్ష్యాలు:

*న్యాయం కోసం మ‌ద్ద‌తు ఇవ్వాల‌నుకునే ప్ర‌తి ఒక్క‌రిని ఏకం చేయ‌డం.
*భాదితుల హ‌క్కుల‌ను కాపాడ‌టం.
తీవ్ర‌మైన నేరాల‌ను నివారించ‌డం, *ప్ర‌పంచంలోని శాంతి, భ‌ద్ర‌త‌ల‌కు భంగం వాటిల్ల‌కుండా చేయ‌డం.
*అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్యకలాపాలు జరుగుతుంటాయి.
*ఈ రోజు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడతారు.

అంతర్జాతీయ న్యాయ దినోత్సవం 2026 ఇతివృత్తం:

“Promoting Justice, Accountability, and Human Rights Worldwide”.మానవ హక్కుల పరిరక్షణ, బాధ్యతాయుతమైన న్యాయ వ్యవస్థ, మరియు నేరస్తులకు శిక్ష పడేలా చూడటం దీని ముఖ్య ఉద్దేశ్యం.

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐ.సి.సి.):

రోమ్‌ స్టాట్యు పదవ వార్షికోత్సవం సందర్భంగా 2008 లో ఇంటర్నేషనల్ జస్టిస్ డేను సెలబ్రేట్ చేశారు . ఐ.సి, సి. అసాధారణ సేవల్ని గుర్తిస్తూ మరింత ప్రశాంత ప్రపంచసృస్టికి, మరింత న్యాయానికి అనువుగా ఎల్లలులేని న్యాయాన్నీ నొక్కి చెప్పడానికి గాను ఇంటర్నేషనల్ జస్టిస్ డేని ప్రకటించారు . జూలై 17 తేదీన ఇంటర్నేషనల్ జస్టిస్ డేగా ప్రకటిస్తూ తీర్మానిస్తూ సంతకాలు చేసిన తొలి ఏకైక మేయర్ గా పోర్ట్ ల్యాండ్ మేయర్ – టామ్‌ పాటర్ ‘ నిలిచిపొయారు . ” ఒకరి హక్కుల్ని ఒకరం పరస్పరం కాపాడుకోలేక పోతే ,మన హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం,వాటిని బహుశా ఎవరూ కాపాడలేకపోవడం సంభవించే సమయం రాగలదని నేను ప్రగాఢముగా విశ్వసించే వ్యక్తిని ” అని మేయర్ టామ్‌పాటర్ పేర్కొనారు . ప్రపంచ వ్యాపతంగా ప్రతి ఒక్కరికీ సమానత్వం, సమాన న్యాయము ఉండాలని అభిప్రాయపడ్డారు.సుమారు 150 దేశాలు సబ్యులగా చేరారు.

ఘోరమైన నేరాలకు వ్యతిరేకంగా పోరాటం:

​ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ముప్పుగా పరిణమించే అత్యంత తీవ్రమైన నేరాలపై విచారణ జరపడం మరియు బాధ్యులను శిక్షించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం.

బాధితులకు న్యాయం చేకూర్చడం:

​యుద్ధాలు, అంతర్గత కలహాల వల్ల నష్టపోయిన అట్టడుగు వర్గాలకు, అమాయక బాధితులకు అండగా నిలవడం ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశం. బాధితుల హక్కులను కాపాడటానికి మరియు వారికి తగిన పరిహారం అందేలా గ్లోబల్ జస్టిస్ వ్యవస్థ కృషి చేస్తుందని ఈ రోజు గుర్తుచేస్తుంది.

జవాబుదారీతనం – చట్టం ముందు అందరూ సమానమే:

​ఎంతటి శక్తివంతమైన నాయకులైనా, పాలకులైనా సరే… వారు చేసిన మానవ హక్కుల ఉల్లంఘనలకు, హింసకు అంతర్జాతీయ చట్టం ముందు సమాధానం చెప్పుకోవాల్సిందే అనే సందేశాన్ని ఈ రోజు బలంగా వినిపిస్తుంది. నేరం చేసిన వారు చట్టం నుండి తప్పించుకోలేరనే భయాన్ని కల్పించడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా అడ్డుకోవచ్చు.

​#అంతర్జాతీయ శాంతి మరియు సమైక్యత:

​ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి కేవలం సంప్రదింపులే కాకుండా బలమైన న్యాయ సూత్రాలు అవసరమని ఈ రోజు ప్రతిబింబిస్తుంది. న్యాయం లేని చోట శాంతి ఉండదు కాబట్టి, అంతర్జాతీయ న్యాయవ్యవస్థకు అన్ని దేశాలు మద్దతు ఇవ్వాలని ఈ రోజు పిలుపునిస్తుంది.

అంతర్జాతీయ న్యాయానికి ఐ.సి.సి ఎంతగానొ తో్డ్పడుతుంది . టెర్రరిజం పెచ్చుమీరిన ఈ రోజుల్లో అన్నిదేశాలు కూడగట్తుకొని న్యాయాన్ని కాపాడెతేనే మానవ మనుగడ ప్రశాంతంగా అహింసామార్గములో పయనించడానికి వీలుపడుతుంది.

సమాజంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదన్నదే దీని ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తింపు చర్యగా ప్రతిఏటా ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు

ఒక్క అమాయకుడికి కూడా అన్యాయం జరగకూడదు” అనేదే న్యాయవ్యవస్థ ప్రాథమిక సూత్రం.ప్రపంచంలో శాంతిభద్రతలు సజావుగా సాగాలన్నా,మానవ హక్కులు పరిరక్షించబడాలన్నా అంతర్జాతీయ న్యాయం ఎంతో అవసరం.దానికి ప్రతీకగా నిలిచేదే ఈ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం.

Tags: uly 17 – International Justice Day