పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని జెడ్పిహైస్కూల్‌లో పదోతరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన టి.షహవార్ షైనింగ్‌స్టార్ అవార్డుకు ఎంపికైనట్లు హెచ్‌ఎం రుద్రాణి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అవార్డుల్లో పుంగనూరు నుంచి తమ స్కూల్‌కు చెందిన షహవార్ 600 లకు 592 మార్కులు సాధించి ఎంపికైందన్నారు. అలాగే బాష్యం పాఠశాలకు చెందిన షేక్‌మహమ్మద్ సుభాన్ కూడ 600లకు 589 మార్కులు సాధించి ఈ అవార్డుకు ఎంపికైయ్యాడు. ఈ నెల 20వ తేదీన మదనపల్లెలో జరిగే సమావేశంలో డీఈవో వీరికి అవార్డులతో పాటు ప్రశంసాపత్రాలు , ఒకొక్కరికి రూ.20 వేలు నగదు అందించనున్నారు. ఈ సందర్భంగా అవార్డు అందుకోబోతున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పలువురు అభినందించారు.

Tags: Shining Star Award for Shahwar and Subhan