పుంగనూరుముచ్చట్లు:
వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ఐకమత్యంతో ఏదైన సాధించేందుకు వీలుందని రాష్ట్ర ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ సంఘ ఉపాధ్యక్షుడు పాల్‌రాజ్ అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో కార్మికుల సమావేశాన్ని సంఘ నాయకుడు మురుగప్ప, సురేంద్రల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల ఐక్యత , సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం సబ్సిడి ధరకు పనిముట్లు అందించాలని, పెన్షన్లు, ఇన్సూరెన్సులు, వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయాలని, వీటిపై కార్మికులు అవగాహన కలిగి ఉండాలని కోరారు.
Tags: With workers’ unity, anything can be achieved.