July 17, 2026
Explore
నీటి కుంటలు రైతులకు సంజీవని

నీటి కుంటలు రైతులకు సంజీవని

July 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

వర్షాలు లేకపోవడంతో నీటికుంటలు రైతులకు సంజీవినిలా తోడ్పాటునిస్తోంది. ఉధ్యానవనశాఖ ఆధ్వర్యంలో రైతులు నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని, ఒకొక్క కుంటకు రూ.90 వేలు, పెద్దకుంటలకు రూ.18 లక్షల వరకు సబ్సిడి మంజూరు చేస్తామని హార్టికల్చర్‌ ఆఫీసర్‌ వరప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. డీడీ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని బోడేవారిపల్లెలో రైతు నిర్మించిన నీటికుంట ఫోటోను విడుదల చేశారు. ఆసక్తి గల రైతులు ఉధ్యానవనశాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Tags:Water ponds are a lifeline for farmers.