July 17, 2026
Explore
నీట్‌లో మోహిత్‌కు 36 వేల ర్యాంకు

నీట్‌లో మోహిత్‌కు 36 వేల ర్యాంకు

July 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బెస్తవీధికి చెందిన మంజుల కుమారుడు బి.మోహిత్‌ నీట్‌ విడుదల చేసిన ఫలితాలలో 36 వేల ర్యాంకు సాధించాడు. శుక్రవారం ఫలితాలను కేంద్రం విడుదల చేసింది. 750 మార్కులకు గాను 550 మార్కులను మోహిత్‌ సాధించాడు. అలాగే క్యాటగిరి కోటాలో 18 వేల ర్యాంకు సాధించాడు. మోహిత్‌ తండ్రి చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి మంజుల పాలవ్యాపారం చేస్తూ కుమారుడిని చదివించింది. ఈసందర్భంగా ఆప్రాంత వాసులు, స్నేహితులు మోహిత్‌ను, అతని తల్లి మంజులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

Tags: Mohit secures 36,000th rank in NEET.