July 17, 2026
Explore
విద్యార్థులచే గర్జన పోస్టర్లు విడుదల

విద్యార్థులచే గర్జన పోస్టర్లు విడుదల

July 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఓబిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గర్జన పోస్టర్లను విడుదల చేశారు. శుక్రవారం ఓబిసి జిల్లా అధ్యక్షుడు వెంకటయాదవ్‌ ఆధ్వర్యంలో స్థానిక బసవరాజ కళాశాలలో పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేసి ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఈనెల 27న పుంగనూరు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు విద్యార్థుల మహార్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ ర్యాలీలో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసుకునేందుకు సహకరించాలని కోరారు.

Tags: ‘Garjana’ posters released by students.