పుంగనూరుముచ్చట్లు:
తిరుమల శ్రీ ఏడుకొండల వెంకటేశ్వరస్వామిని గరుడోత్సవం రోజు దర్శించుకునేందుకు సుమారు 200 మంది భక్తులు శుక్రవారం బయలుదేరారు. స్థానిక కోనేటి వద్ద నుంచి భక్తులు ఏడుకొండల వాడ గోవిందా….ఆపదవెహోక్కులవాడ గోవింద ….అనాధరక్షక గోవింద అంటు కలియుగ శ్రీ వెంకటేశ్వరస్వామిని భక్తితో పూజించి, కాలినడకన బయలుదేరారు. భక్తబృందం ఈనెల 19న గరుడోత్సవం రోజు తిరుమల చేరుకుని స్వామివారికి తలనీలాలు సమర్పించి, వెహోక్కులు చెల్లించనున్నారు.
Tags: Devotees’ pilgrimage on foot for Garuda Seva