July 17, 2026
Explore
రమ్యశ్రీ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రుల ఆవేదన

రమ్యశ్రీ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రుల ఆవేదన

July 17, 2026 | Andhra Pradesh

-ఊపిరితిత్తుల వ్యాధి

  • చికిత్సకు రూ.50 లక్షలు ఖర్చు

పుంగనూరుముచ్చట్లు:

సాధారణ రైతు కుటుంబంలో వెంకట్రమణ, లక్ష్మీ దంపతులకు మూడవ కుమారైగా జన్మించిన రమ్యశ్రీ ఎంతో చలాకిగా చదువుకుంటు సీఏ చేరింది. పట్టుదలతో చదువును కొనసాగిస్తుండగా ఒక్కసారిగా ఆమెకు ఊహించని ప్రాణాంతమైన ఎల్‌ఏఎం ఊపిరితిత్తుల వ్యాధిసోకింది. ఆసుపత్రులకు తిరిగిన ఫలితం లేదని, ఊపిరితిత్తులు మార్చాలని వైద్యులు తెలపడంతో ఆమె భవిష్యత్తును కుదేలైంది.

బెంగళూరు శిక్షణలో ….

రమ్యశ్రీ సీఏ పూర్తి చేసుకుని బెంగళూరులో చార్టెడ్‌ అకౌంటెంట్‌ దగ్గర శిక్షణలో ఉండగా శ్వాసకోస సంబంధమైన సమస్య ఏర్పడింది. వెంటనే తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించారు. కానీ నయం కాలేదు. చెన్నై ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఊపిరితిత్తులు చెడిపోయిందని, వాటిని మార్చాలని సూచించారు.

రూ.50 లక్షలు ఖర్చు….

రమ్యశ్రీకి ఊపిరితిత్తులు రెండు తీవ్రంగా దెబ్బతినడంతో వాటికి చికిత్సలు చేసుకునేందుకు చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఊపిరితిత్తుల మార్పిడికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని తెలపడంతో ఆకుటుంబం కన్నీరుమున్నీరౌతోంది. అంత డబ్బు సమకూర్చలేని తల్లిదండ్రులు ఇటు బిడ్డను పోగొట్టుకోలేక, చికిత్సలు అందించలేక దాతల సాయంకోసం ఎదురుచూస్తున్నారు. తమ బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేసే దాతల కోసం తల్లిదండ్రులు కంటికి కునుకులేకుండ ఎదురుచూస్తున్నారు. దాతలు ఆదుకుని , తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలని ప్రాదేయపడుతున్నారు. విరాళాలు అందించే దాతలు సెల్‌నెంబరు: 7569298992 కు విరాళాలు అందించాలని కోరుతున్నారు.

Tags; Parents’ anguish over saving Ramyashree’s life.